IPL Live

Thursday, December 22, 2011

నీ చూపులో...!





నీ చూపులలోని సందేశం, చెప్పింది నీ మనోగతం,
తెలిపేలోగా సమ్మతం, మార్చుకున్నావు అభిమతం.
ప్రేమను కోరుకున్నావు అప్పుడు,
దాన్ని సమాధి చేస్తావా ఇప్పుడు...?
నా చూపుకై వేచి చూశావు, నా మనసుతో చూశానని గ్రహించలేక పోయావు…!
నీవు వదిలి వెళ్ళిన జ్ఞాపకాల జడి వాన లో నిత్యం తడుస్తూ,

నాలో కలిసిపోవాలనుకున్న నీలోని నేను…!

-Vamshi(Bobby)

Sunday, June 26, 2011

నీ కొసం...!






గోదావరి తీరంలో, నా మది లోతుల్లో,
నీ ఊహల ఊయల్లో నీ కొసం వేచి ఉన్నాను.
కళ్ల ముందుకి కదిలొస్తావో, కనుల వెనుక కలవౌతావో..
కడకు మరణించే లోగానైనా కరుణిస్తావని ఎదురు చూస్తూ...

నీకు ఏమీ కాని.. నీ......!

-వంశీ

Saturday, June 25, 2011

నా ప్రియా...!






మనసైన నెచ్చెలి వాలు కనులు ఓర కంట చూసినంతనే,
సుధలూరు అధరాలు చిరునవ్వు విసిరినంతనె,
ఆ దొంగ చూపుల కొంటె ఊసులు నా మది మీటగా
ఏమని వర్ణింతు ఆ దివ్య సౌందర్యం
మాటలకందునా ఆ మధురానుభవం...!
-వంశీ(Bobby)